Breaking News
Home / States / అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు…

అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు…

వరంగల్ : శుక్రవారం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు మంత్రులకు, చీఫ్ విప్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవి నవరాత్రుల సందర్భంగా వారు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వారికి ఆలయ పూజారులు అమ్మవారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని వేడుకున్నట్టు పేర్కొన్నారు. మంత్రులకు స్వాగతం పలికిన వారిలో ఆలయ అధికారులు, వేద పండితులు, పాలకవర్గ సభ్యులున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *