Breaking News
Home / National / ఇరాన్‌ చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి!

ఇరాన్‌ చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి!

టెహ్రాన్‌: సౌదీ అరేబియా తీరంలో ఇరాన్‌కు చెందిన ఓ చమురు ట్యాంకర్‌పై దాడి జరిగింది. జెద్దా తీరంలో చమురును తీసుకెళ్తున్న ఓడపై రెండు క్షిపణులు దాడి చేసినట్లు ఇరాన్‌ అధికారిక టీవీ వెల్లడించింది. దీంతో ట్యాంకర్‌లో పేలుడు సంభవించి చమురు ఎర్ర సముద్రంలోకి లీకైంది. ఈ చమురు ట్యాంకర్‌ నేషనల్‌ ఇరానియన్‌ ఆయిల్‌ కంపెనీకి చెందింది. ఘటనపై ఆ కంపెనీ స్పందించి ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఓడలోని సిబ్బంది క్షేమంగా ఉన్నారని తెలిపింది. దీనిపై సౌదీ అరేబియా ఇంకా స్పందించలేదు.

ఇప్పటికే ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. గత నెల సౌదీ అరేబియాలోని రెండు చమురు క్షేత్రాలపై డ్రోన్‌ దాడి జరిగింది. ఇరాన్‌ మద్దతున్న హుతీ తిరుగుబాటుదారులు ఈ దాడి చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో సౌదీ తీరంలో ఇరాన్‌ ట్యాంకర్‌పై దాడి జరగడం గమనార్హం.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *