తిరుపతి : తిరుమల ఘాట్ రోడ్డులో పెనుప్రమాదం తప్పింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుమల కొండపైకి వెళ్లే 2 వ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు, సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కొండచరియలు రోడ్డుపై కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో.. ప్రమాదం తప్పిందని అధికారులు అన్నారు.
