విశాఖ: ముఖ్యమంత్రి జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు పాలనలో ఓటుకు నోటు, కాల్‌మని, ఇసుక మాఫియా లాంటివి ఎన్నో చూశామని చెప్పారు. చంద్రబాబుకు మతిపోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. లోకేష్‌కు భవిష్యత్తు ముగిసిపోయిందన్న ఆవేదనతో చంద్రబాబు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. 6 నెలల్లో జగన్ దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు చట్టాన్ని అతిక్రమిస్తే నోరుమూసుకుని కూర్చోమంటారా?, గత ఐదు సంవత్సరాల్లో పోలీసులు తెలుగుదేశం పార్టీలో పనిచేశారా? అని ప్రశ్నించారు.
