Breaking News
Home / States / Andhra Pradesh / ఇసుక కొరతను నిరసిస్తూ ఎమ్మెల్యే నిరసన….

ఇసుక కొరతను నిరసిస్తూ ఎమ్మెల్యే నిరసన….

రాజమహేంద్రవరం: రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను నిరసిస్తూ రాజమహేంద్రవరంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని నిరసన దీక్ష చేపట్టారు. ఇసుక మాంద్యంతో కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ ”రాష్ట్రంలో ఇసుక మాంద్యం వల్ల ఇబ్బందులు పడుతున్న కార్మిక సోదరులందరికీ మేం ఉన్నామని ధైర్యం చెప్పేందుకే ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. గత ప్రభుత్వ పాలసీని మారుస్తామని చెప్పిన జగన్‌ ప్రభుత్వం మూడు, నాలుగు నెలల వరకు ఇసుక విధానమే తీసుకురాలేదు. తక్షణమే సీఎం మేల్కొని ఇసుక కొరతను తీర్చాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నాం ” అని అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *