Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / గట్టిగా అరిస్తే… గడ్డిపరక సింహం కాలేదు: రోజా

గట్టిగా అరిస్తే… గడ్డిపరక సింహం కాలేదు: రోజా

అమరావతి: చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ లో టీడీపీ నేతలు ఉన్నా వారిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. మొదటిసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆ అయిదు సంవత్సరాల కాలంలో అనేక ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తే, కనీసం మైక్స్ కూడా ఇవ్వలేదని అన్నారు. మేము పోరాటం చేసినవి ఏం కూడా ప్రజలకి తెలియకుండా చేశారని అన్నారు. మార్షల్స్ తో మమల్ని బయటికి గెంటించి వేశారని, వీడియోలు చూస్తే మీకు అర్థం అవుతుందని సభలో వ్యాఖ్యానించారు. ఈనాడు పేపర్లో వచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తే.. నాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించారని అన్నారు.

సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా నాపై సస్పెన్షన్ ఎత్తివేయలేదని రోజా అన్నారు. అసెంబ్లీ రూల్స్ కు విరుద్ధంగా నన్ను ఏడాదిపాటు సస్పెండ్ చేశారని, దీనిపై అసెంబ్లీలో చర్చకు తీసుకువచ్చిన చర్చ జరగనివ్వలేదని ఆమె అన్నారు. ఈరోజు సభలో చంద్రబాబు గట్టి గట్టిగా అరుస్తున్నారు, గట్టిగా అరిస్తే గడ్డిపరక గర్జించే సింహం కాలేదని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని రోజా వ్యాఖ్యానించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *