Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఆయన ఇక రెస్టు తీసుకుంటే మంచిది…

ఆయన ఇక రెస్టు తీసుకుంటే మంచిది…

అమరావతి : చంద్రబాబు తీరు చూస్తుంటే భయంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు సేవలు చాలని, ఇక ఆయన రెస్టు తీసుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. శాసనసభలో అప్పలరాజు మాట్లాడుతూ.. ‘ఈ సభలో మేం జూనియర్స్‌. చాలా నేర్చుకోవాల్సి ఉంది. స్పీకర్‌ పట్ల చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారు.

బాబుది ఒక మానసిక వ్యాధి. ముందుగా ఆయనకు పరీక్షలు చేయించాలి. జబ్బు నయం అయ్యాక అసెంబ్లీలోకి తీసుకురావాలి. తనది రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం అని బాబు అన్నారు. ఆయన సేవలు చాలు. ఇక రెస్టు తీసుకోవచ్చు. మరొక ఆరు నెలల్లో చాలా చూస్తారని చంద్రబాబు బెదిరించారు. బాబు మాటలు వింటుంటే భయంగా ఉంది. మొన్న పార్లమెంట్‌కు వెళ్లినప్పుడు వంగి ఉన్నారు. నిన్న అమరావతి వెళ్లి పడుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దండ వేసుకున్నారు. డాక్టర్‌కు చెప్పి ఆయనకు ఉన్న వ్యాధిని నయం చేయాలి. మా ఊరి నాయకుడి పట్ల అనుచితంగా మాట్లాడితే ఊరుకోం’అని అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *