Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / చంద్రబాబుపై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు…

చంద్రబాబుపై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు…

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశం వేదికగా.. చంద్రబాబు ప్రభుత్వం తీసుకొన్న ఇటీవలి నిర్ణయాలపై ధ్వజమెత్తారు. తమ రాష్ట్రాల్లోకి సీబీఐ ప్రవేశాన్ని నిరాకరించాలన్న చంద్రబాబు, మమతా బెనర్జీ సర్కారుల నిర్ణయంపై ఆయన పరుష వ్యాఖ్యలు చేశారు. ‘‘అంత భయపడేంత తప్పు వారు ఏం చేశారు? ఇప్పుడు సీబీఐని నిరాకరించారు.. రేపు మరికొన్ని సంస్థలను రానీయమంటారు.. సైన్యం, పోలీసులు, సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, కాగ్‌.. ఇలా ప్రతిదీ వారి దృష్టిలో తప్పుడు సంస్థే. వారు మాత్రమే సచ్ఛీలురు’’ అని ఎద్దేవా చేశారు. తాను గుజరాత్‌ సీఎంగా ఉండగా, తొమ్మిది గంటలపాటు సిట్‌ కార్యాలయంలో విచారణను ఎదుర్కొన్నానని మోదీ గుర్తు చేశారు. ఆయనతో కలిసి వేదిక పంచుకొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా.. సీఎం చంద్రబాబు తదితర మూడో కూటమి నేతలను ఉద్దేశించి, తీవ్రభాషను ఉపయోగించారు. ‘‘కూటమికి నాయకులుగా ఎవరు ఉంటారు? బెంగాల్‌ దీదీయా (మమత), ఆంధ్రప్రదేశ్‌ బాబా (చంద్రబాబు), యూపీ బెహన్‌జీయా (మాయావతి)?’’ అని ఎద్దేవా చేశారు.

Check Also

సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపిక ఈ నెల 24

Share this on WhatsAppన్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్‌ను ఎంపిక చేయడానికి సెలెక్షన్ కమిటీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *