Breaking News
Home / States / Andhra Pradesh / మోదీ సర్కార్ గుడ్ న్యూస్…

మోదీ సర్కార్ గుడ్ న్యూస్…

ఉత్తరాంధ్ర: మూడు జిల్లాల్లోని తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిదివేల ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్), కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రాజ్యసభలో తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం సమాధానమిస్తూ.. పైప్‌లైన్ ద్వారా ఇంటికి వంట గ్యాస్ సరఫరా చేసే ఈ ప్రాజెక్టు కోసం ఐఓసిఎల్ 211 కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారుగ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ హక్కుల కోసం 9 వ రౌండ్ వేలం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పైప్డ్ గ్యాస్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి, నిర్వహించడానికి ఐఓసిఎల్‌ హక్కులు సంపాదించిందని …ఈ పనుల్లో భాగంగా.. ఐఒసిఎల్ ఇప్పటికే హుక్-అప్ సౌకర్యాలు, సిటీ గ్యాస్ స్టేషన్‌తో పాటు పైప్డ్ గ్యాస్ నెట్‌వర్క్ డిజైన్ పనులను పూర్తి చేసిందని మంత్రి వెల్లడించారు..

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *