న్యూఢిల్లీ : జపాన్లో టైఫూన్ హగిబిస్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. తుఫాన్ తదనంతర పరిస్థితిని తన స్నేహితుడు, ప్రధాని షింజో అబే సమర్థంగా ఎదుర్కోగలరని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. టైపూన్ హగిబిస్ వల్ల జపాన్లో 30 మంది మరణించారు.
