Breaking News
Home / National / గెలుపు కోసం మోదీ ఏమైనా చేస్తారు: గెహ్లాట్

గెలుపు కోసం మోదీ ఏమైనా చేస్తారు: గెహ్లాట్

జైపూర్: ఎన్నికల్లో గెలవడం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏదైనా చేయగలరని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. భావోద్వోగాలు రెచ్చగొట్టి రాజకీయాల్లో లబ్ది పొందడం మోదీకి అలవాటని ఆయన అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ నేత మణిశంకర్ అయ్యార్ చేసిన వ్యాఖ్యలపై మోదీ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలుపొందారని అన్నారు.

అసత్యాల్ని ప్రచారం చేసి ప్రజల్ని అయోమయంలో నెట్టేయడం బీజేపీ నేతలకు అలవాటని గెహ్లాట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. మోదీ, అమిత్‌షాలకు ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీయేనని అన్నారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలో పరిస్థితులు అనుకూలించలేదని, కానీ వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయం రాహులేనని అశోక్ గెహ్లాట్ అన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *