Breaking News
Home / National / పాక్ అనుమతిని తోసిపుచ్చిన మోదీ…

పాక్ అనుమతిని తోసిపుచ్చిన మోదీ…

న్యూఢిల్లీ: పాకిస్థాన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం చివరి నిమిషంలో తన మనసు మార్చుకున్నారు. బిష్కెక్‌లో జరుగనున్న ఎస్‌సీఓ సదస్సుకు పాక్ గగనతల మార్గం నుంచి కాకుండా ఒమెన్ మార్గం గుండా వెళ్లాలని ప్రధాని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం మోదీ వీవీఐపీ విమానంలో ఒమెన్, ఇరాన్, సెంట్రల్ ఆసియా దేశాల గుండా బిష్కెక్ చేరుకుంటారు. ప్రధాని తన పర్యటన మార్గం విషయంలో తీసుకున్న తాజా నిర్ణయాన్ని ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి.

దీనికి ముందు, పాక్ గగనతలం మీదుగా మోదీ వెళ్లేందుకు అనుమతించాలని ఆ దేశాన్ని భారత్ కోరింది. పాకిస్థాన్ సైతం భారత్ విజ్ఞప్తికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. బాలాకోట్‌లో జైషే ఉగ్రవాద శిబిరాలపై భారత్ వాయిసేన దాడుల తర్వాత పాకిస్థాన్ తమ గగనతల మార్గాలను మూసివేసింది. కేవలం రెండు మార్గాలను మాత్రమే తెరిచి ఉంచింది. ఈ రెండు మార్గాల గుండా కాకుండా మూడో మార్గం గుండా మోదీ వెళ్లేందుకు గగనతల మార్గం తెరవాలని భారత్ పాక్‌ను కోరింది. ఇందుకు పాక్ సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే, ఇరు దేశాల మధ్య చిరకాలంగా ఉపరిష్కృతంగా ఉన్న చర్చలు మొదలవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అయితే, మోదీ చివరినిమిషంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఒమెన్ గుండా తన పర్యటన సాగించాలని నిర్ణయించుకున్నారు.

Check Also

మంగల్‌ పాండే వివాదాస్పద వ్యాఖ్యలు

Share this on WhatsAppపట్నా: బీహార్ లో మెదడువాపు వ్యాధి బారిన పడి 103 మంది చిన్నారు మృతి చెందిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *