Breaking News
Home / Lifestyle / Business / మోదీ ప్రమాణ స్వీకారం వేళ.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

మోదీ ప్రమాణ స్వీకారం వేళ.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా దూసుకెళ్లగా… నిఫ్టీ 85 పాయింట్ల మేర లాభం నమోదు చేసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 329.92 (0.84 శాతం) లాభంతో 39831.97 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 84.80 (0.71 శాతం) పాయింట్లు ఎగసి 11945.90 వద్ద క్లోజయ్యింది. ఎన్టీపీసీ, భారతి ఎయిర్‌టెల్, ఎస్ బ్యాంకు, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు 3.32 శాతం మేర అత్యధిక లాభాలను నమోదు చేసిన వాటిలో ఉన్నాయి. కాగా బీఎస్‌ఈలోని మొత్తం 30 స్టాక్‌లలో 21 వరకు లాభాల్లో ముగియడం విశేషం.

Check Also

విక్రమ్ కోసం కొనసాగుతున్న ‘నాసా’ ప్రయత్నాలు….

Share this on WhatsAppబెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కలల ప్రాజెక్టు చంద్రయాన్‌2కి చెందిన విక్రమ్ ల్యాండర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *