Breaking News
Home / National / మోదీ వీఆర్ఎస్ తీసుకోనున్నారు.. ధర్మ పోరాట దీక్షలో జైరాం

మోదీ వీఆర్ఎస్ తీసుకోనున్నారు.. ధర్మ పోరాట దీక్షలో జైరాం

ఢిల్లీ: విభజన హామీలను మోదీ సర్కార్ అస్సలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు సర్కార్‌కు తమ నేత రాహుల్ గాంధీ సంఘీభావాన్ని తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. మోదీ వీఆర్ఎస్ తీసుకోనున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో జరగుతున్న ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ఆయన.. కొత్త ప్రభుత్వం రాగానే.. తీసుకునే తొలి నిర్ణయం.. ప్రత్యేక హోదా అంశమేనన్నారు. పోలవరంపై మలి విడత నిర్ణయముంటుందన్నారు. ఢిల్లీలోనే కాదు ఏపీలోనూ తమ నేత రాహుల్ ఇవే హామీలు ఇచ్చారన్నారు. 40 ఏళ్లుగా టీడీపీ, కాంగ్రెస్ ఒకదానికి వ్యతిరేకంగా మరొకటి పోరాడాయని.. కానీ ఇప్పుడు తమకు ఓ ఉమ్మడి శత్రువు ఎదురయ్యాడని పేర్కొన్నారు. కేంద్రం సహకరించకపోయినా… చంద్రబాబు పోలవరాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాజ్యసభ వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని… మోదీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ప్రత్యేక హోదా పార్లమెంట్‌ వేదికగా ఇచ్చిన హామీయే కదా? పార్లమెంట్‌ వేదికగా ఇచ్చిన హామీలకే అతీగతీ లేకుండాపోయిందని జైరాం ఆవేదన వ్యక్తం చేశారు.

జైరాం ప్రసంగం అనంతరం బాబు మైక్ అందుకుని.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. చట్టాన్ని అమలు చేయించడానికి జైరాం ఎంతగానో కృషి చేశారన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక.. తాను తొలిసారి ఢిల్లీ వెళ్లినప్పుడు తనతో పాటు ప్రతి మంత్రి దగ్గరకి వచ్చారని.. అదీ ఆయన నిబద్ధత తెలియజేస్తుందన్నారు.

Check Also

రాజకీయాలకతీతంగా దాడిని ఖండించాం: రామ్మోహన్‌నాయుడు

Share this on WhatsAppన్యూఢిల్లీ: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వివరించారని టీడీపీ ఎంపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *