Breaking News
Home / States / తల్లి మరణం తట్టుకోలేక కొడుకు మృతి….

తల్లి మరణం తట్టుకోలేక కొడుకు మృతి….

చేవెళ్ల: కన్నతల్లి మరణాన్ని తట్టుకోలేక ఓ తనయుడి గుండె ఆగింది. మాతృమూర్తి మరణాన్ని జీర్ణించుకోలేక గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడు. తల్లి అంత్యక్రియలు పూర్తి చేసి ఇంటికి రాగానే గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కుమ్మేరకు చెందిన బోదె రత్నమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. కుమారుడు బోదె రంగారెడ్డి ఆమెకు దహనసంస్కారాలు చేశాడు. అనంతరం ఇంటికి వచ్చిన కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబంలో ఒక్కసారిగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *