Breaking News
Home / Lifestyle / Business / మోటోరోలా సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల…

మోటోరోలా సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల…

ముంబయి: మొబైల్స్ తయారీదారు మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటోరోలా వన్ మాక్రోను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ.9,999 ఉండగా దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 12వ తేదీ నుంచి విక్రయించనున్నారు. జియో యూజర్లకు ఈ ఫోన్ కొనుగోలుతో రూ.2200 విలువైన క్యాష్‌బ్యాక్ వోచర్లు, 125 జీబీ అదనపు డేటాను అందివ్వనున్నారు.

మోటోరోలా వన్ మాక్రో ఫీచర్లు…

6.2 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *