Breaking News
Home / Film News / విడుదలకు సిద్దమైన సినిమా….

విడుదలకు సిద్దమైన సినిమా….

ఫిల్మ్ న్యూస్: విజయ్ దేవరకొండ నిర్మాతగా ఆయన సొంత బ్యానర్ నుంచి తొలి సినిమాగా ‘మీకు మాత్రమే చెప్తా’ రూపొందింది. షమ్మీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, తరుణ్ భాస్కర్ .. అనసూయ .. వాణి భోజన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.

సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాను, నవంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. హీరోగా స్టార్ డమ్ ను అందుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో నిర్మాతగా మారడం ఒక విశేషమైతే, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరోగా చేయడం మరో విశేషం. ఈ ఇద్దరూ కలిసి చేసిన ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *