Breaking News
Home / Film News / ప్రేక్షకులకు థాంక్స్ చెప్పిన చిత్రబృందం…

ప్రేక్షకులకు థాంక్స్ చెప్పిన చిత్రబృందం…

ఫిల్మ్ న్యూస్: రాజుగారి గది 3 విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ ‘నా తమ్ముడు అశ్విన్ ను యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ అందరికి ధన్యవాదాలు. ప్రేక్షుకుల సపోర్ట్ ఉంటే ఎవరైనా ఎక్కడికైనా వెళ్తారు. వైజాగ్ మెలోడీ థియేటర్ లో పెద్ద హీరో షోస్ కు మాత్రమే ఫుల్ అవుతుంటాయి. కానీ మా రాజు గారి గది 3 ఫుల్స్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా బాగా ఆదరిస్తారని భావిస్తున్నాను. ఈ సినిమాకోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అన్నారు.

ఓంకార్ తో పాటు ఆలీ కూడా ఆడియన్స్ కు థాంక్స్ తెలిపి ఈ సినిమాను అందరూ కష్టపడి పని చెయ్యడంతోనే విజయం సాధించిందన్నారు. చోటా కె నాయుడు మాట్లాడుతూ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా 4 కోట్ల గ్రాస్ చేసింది. అశ్విన్ ఈ సినిమా ప్రాణం పెట్టి తీసాడు. మంచి సినిమాను అందరూ ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *