Breaking News
Home / National / అక్రమంగా తరలిస్తున్న ధనం స్వాధీనం…

అక్రమంగా తరలిస్తున్న ధనం స్వాధీనం…

నాగపూర్: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ధనప్రవాహం సాగుతోంది. పచ్‌పోలి ఓవర్ బ్రిడ్జి, నాగపూర్ రైల్వే స్టేషన్ వద్ద రెండు కార్లను సోదా చేసిన పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులకు కోటి రూపాయల నగదు లభించింది. అక్టోబర్ 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా అధికారులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనిఖీ చేయగా ఒక కారులో రూ. 76 లక్షలు, మరో కారులో 25 లక్షలు లభించాయి. మహారాష్ట్ర పోలీసు శాఖకు చెందిన ప్రత్యేక బృందాలు, ఎన్నికల సంఘం బృందాలు సంయుక్తంగా వాహనాలను సోదా చేస్తున్నాయి. ఎన్నికల నిమిత్తం అక్రమంగా డబ్బు తరలిస్తున్న వ్యక్తులపై నిఘా వేసి వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *