Breaking News
Home / States / Andhra Pradesh / అమరావతిలో ఎంపీ, ఎమ్మెల్యేల పర్యటన….

అమరావతిలో ఎంపీ, ఎమ్మెల్యేల పర్యటన….

గుంటూరు: నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే నంబూరి శంకర్‌ రావు లు గుంటూరు జిల్లా అమరావతి మండలం కర్లపుడి గ్రామంలో బుధవారం పర్యటించారు. నాయకులు, గ్రామస్థులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ముందుగా చర్చిలో ప్రార్థనలు నిర్వహించిన ఎంపీ, ఎమ్మెల్యేలు అనంతరం ఇతర పార్టీల నుండి వైసీపీలోకి చేరబోతున్న 100 మందికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వారిరువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ప్రోద్భలంతో పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చిందని, రానున్న స్థానిక ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ప్రతి ఒక్క వర్గానికి, మతానికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని, గ్రామ సచివాలయం వ్యవస్థతో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. విద్య, వైద్యం మెరుగుపడేందుకు సీఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆశావర్కర్లు, వాలంటీర్లు ఎంపీ, ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *