వరంగల్: టీఆర్ఎస్కు చెందిన రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్ గన్మెన్లు ఆయన అల్లుడితో కలిసి టిక్టాక్ల్లో మునిగి తేలడం కలకలం రేపుతోంది. వరంగల్ రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ అల్లుడు జగన్కు గన్మెన్లుగా యాక్షన్ చేస్తూ వీడియోలకు ఫోజులిచ్చారు. అనంతరం ఆ వీడియోలను జగన్ ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టు సందర్శిస్తున్న క్రమంలో ఎంపీ భద్రతను గాలికి వదిలేసి వీడియోలు చిత్రీకరణలో మునిగిపోయారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
