Breaking News
Home / States / Andhra Pradesh / వైసీపీ నేతలపై గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు….

వైసీపీ నేతలపై గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు….

విజయవాడ: మంగళవారం టీడీపీ బృందం వైసీపీ నేతల వేధింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జగన్ రాక్షస పాలన సాగుతుందని, విపక్ష నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని అన్నారు. రౌడీయిజం, రాక్షసత్వం, ఫ్యాక్షనిజం వంటివే ఏపీలో నడుస్తున్నాయని, ఘోరాలు, నేరాలను వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నాని ఆరోపించారు.

నిజాయితీ అధికారులు, అధ్యాపకులపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని, జగన్ ప్రభుత్వంలో అరాచకాలను ఆధారాలతో సహా గవర్నర్‌కు వివరించామన్నారు. అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని గవర్నర్‌ హామీ ఇచ్చారని అన్నారు. జగన్‌ ఢిల్లీ పర్యటన…రాష్ట్రాభివృద్ధి కోసమా?, కేసుల కోసమా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలోని కట్టడాలను కూల్చడం మినహా జగన్ చేపట్టిన నిర్మాణాలు ఎక్కడని కేశినేని నిలదీశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *