Breaking News
Home / National / పార్లమెంట్ ఆవరణలో ఫుట్‌బాల్ ఆడిన ఎంపీ..

పార్లమెంట్ ఆవరణలో ఫుట్‌బాల్ ఆడిన ఎంపీ..

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఓ ఎంపీ ఫుట్‌బాల్ ఆడి అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. బడ్జెట్ సమావేశాలకు హాజరైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ప్రసన్ బెనర్జీ పార్లమెంట్ ఆవరణలో కొద్దిసేపు ఫుట్‌బాల్ ఆడారు. ఈ విషయంలో ఆయనను మీడియా ప్రశ్నించగా.. మన దేశంలో ఫుట్‌బాల్ ఆటను ప్రోత్సహించేందుకే తాను పార్లమెంట్ ఆవరణలో ఆడానని వివరించారు. ఈ విషయంలో త్వరలో ప్రధాని నరేంద్రమోదీ, క్రీడాశాఖ మంత్రిని కూడా కలుస్తానన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇండియా ఫుట్‌బాల్ జట్టు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. హౌరా లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసన్ బెనర్జీ.. గతంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా సేవలందించారు.

Check Also

ఢిల్లీ మాజీ సిఎం అంత్యక్రియల ఖర్చు ఎంతో తెలుసా?

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం నిగంబాధ్‌ ఘాట్‌లో జరిగాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *