Breaking News
Home / States / వారు రెచ్చగొట్టడం వల్లే కార్యికుల ఆత్మహత్యలు….

వారు రెచ్చగొట్టడం వల్లే కార్యికుల ఆత్మహత్యలు….

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్న సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు అణచివేతకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. గాంధీభవన్‌లో సీనియర్‌ నేతలు దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌ అలీతో కలిసి రేవంత్‌ మీడియాతో మాట్లాడారు.

కార్మికులతో చర్చలు జరిపి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ సమస్యలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నామని.. కార్మికులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని చెప్పారు. ఆర్టీసీ కార్మికులతో ఈనెల 21న ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామన్నారు. 19న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ బంద్‌కు కాంగ్రెస్‌ పూర్తి మద్దతిస్తుందని రేవంత్‌ స్పష్టం చేశారు. మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *