Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / పిచ్చివేషాలు వేస్తే చూస్తూ ఊరుకోదు….

పిచ్చివేషాలు వేస్తే చూస్తూ ఊరుకోదు….

అనంతపురం: నేడు ఎంపీ సుజనాచౌదరి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు సచివాలయ ఉద్యోగాలిచ్చామంటూ వైసీపీ రాజ్యసభ సభ్యులు చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. చంద్రబాబు, వైఎస్‌ కుటుంబాలు ఏపీకి పట్టిన పీడ అని విమర్శించారు. టీడీపీ, వైసీపీ వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

రాష్ట్రంలో అంతా రివర్స్‌ నడుస్తోందని, ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన నడవడం లేదని సుజనాచౌదరి అన్నారు. వైసీపీ నేతల వల్ల కియా వంటి పరిశ్రమలు నెలకొల్పే పరిస్థితి లేదని, వారు పిచ్చివేషాలు వేస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదన్నారు. పోలవరం ఆలస్యం వల్ల రూ.వేలకోట్ల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *