Breaking News
Home / National / ఫేస్‌బుక్‌ పోస్ట్ కారణంగా ఎంపీ భార్యపై తీవ్ర విమర్శలు

ఫేస్‌బుక్‌ పోస్ట్ కారణంగా ఎంపీ భార్యపై తీవ్ర విమర్శలు

కొచ్చి: కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ భార్య ఆనా లిండా ఈడెన్ తన ఫేస్‌బుక్ పోస్ట్ కారణంగా విమర్శలపాలయ్యారు. విధిని అత్యాచారంతో పోలుస్తూ ఫేస్‌బుక్‌లో కామెంట్ చేసినందుకు నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే కేరళలో కురిసిన వర్షాల కారణంగా కొచ్చీలోని ఆమె ఇంటి పరిసరాలు జలమయమయ్యాయి. దీనిపై సరదాగా కామెంట్ చేద్దామనుకున్న ఆనా లిండా ఫేస్‌బుక్‌లో సోమవారం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి పోస్ట్ చేశారు. “విధి అత్యాచారం లాంటిది. ప్రతిఘటించటం కుదరకపోతే ఎంజాయ్ చేయాలి” అని ఓ కామెంట్ కూడా పెట్టారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. స్వయంగా జర్నలిస్టు అయ్యుండి కూడా ఇలాంటి వ్యాఖ్యాలు చేయడమేంటని ఆమెపై విరుచుకుపడ్డారు. దీంతో మంగళవారం ఉదయం ఆనా తన పోస్టును తొలగించారు. ఈ కామెంట్ చేసినందుకు తానెంతో బాధపడుతున్నానని, తనకు మహిళలను కించపరిచే ఉద్దేశం ఏమాత్రం లేదని ఫేస్‌బుక్ ద్వారా ఆనా లిండా క్షమాపణలు కోరారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *