Breaking News
Home / National / భారత్‌లో అత్యంత ప్రమాదకరమైన సెలబ్రిటీ ఎంఎస్ ధోనీనే

భారత్‌లో అత్యంత ప్రమాదకరమైన సెలబ్రిటీ ఎంఎస్ ధోనీనే

న్యూఢిల్లీ: టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కెప్టెన్‌గా భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన ధోనీ.. ఆ తర్వాత ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు. అయితే ధోనీ గురించి తెలుసుకోవాలని అతని అభిమానుల్లో బలంగా ఉంటుంది. అతని బాల్యం, క్రికెట్ జీవితం, లైఫ్‌స్టైల్ తదితర అంశాల గురించి ఇంటర్‌నెట్‌లో వెతుకుతుంటారు. అయితే వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు వీరినే టార్గెట్‌గా చేసుకుంటున్నారని.. ప్రముఖ యాంటీ-వైరస్ సంస్థ మెక్‌కాఫే మంగళవారం వెల్లడించింది. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన సెలబ్రిటీ ఎంఎస్ ధోనీనే అని పేర్కొంది. ధోనీ పేరును గూగుల్‌లో సెర్చ్ చేయడాన్ని అదనుగా తీసుకొని.. మాల్‌వేర్‌ను, మాలిషియస్ వెబ్‌సైట్లను వ్యాప్తి చేస్తున్నారని తెలిపింది.

అయితే ధోనీ తర్వాతి స్థానంలో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో ఉండగా.. బిగ్‌బాస్-8 రియాల్టీ షో విన్నర్ గౌతమ్ గులాటీ మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఈ జాబితాలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ నాలుగో స్థానంలో, పాప్ సింగర్ బాద్‌షా ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. నటి రాధికా ఆప్టే, శ్రద్ధా కపూర్, క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్, షట్లర్ పీవీ సింధు, ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఉన్నారు.

‘‘ఇంటర్‌నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచంలోని ఏ అంశాన్నైనా.. ఇంటర్‌నెట్ ద్వారా సులభంగా పొందగలుగుతున్నారు. అయితే డబ్బులు చెల్లించి వినియోగించే ప్లాట్‌ఫాంలు నెట్‌లో పెరిగిపోవడంతో యూజర్లు.. ఫ్రీ కంటెంట్ కోసం వెతుకడం ప్రారంభించారు. ప్రధాన స్పోర్ట్స్ ఈవెంట్స్, సినిమాలు, టీవీ షోలు, వాళ్ల ఫేవరెట్ సూపర్‌స్టార్ ఫొటోలు ఉచితంగా చూసేందుకు పైరసీ ప్లాట్‌ఫాంల వేటలో వాళ్లు పడ్డారు. అయితే దీని ద్వారా ప్రమాదం వస్తుందని వాళ్లకు తెలుసు. అయినా కూడా వాళ్లు మానకపోవడం దురదృష్టకరం’’ అని మెక్‌కెఫే వైస్ ప్రెసిడెంట్ వెంకట్ కృష్టపూర్ తెలిపారు.

అయితే 2020నాటికి భారత్‌లో సగటు యువత వయస్సు 29గా ఉండనుందని అంచనా.. తద్వారా భారత్ అత్యధిక యువత ఉన్న దేశంగా ఎదుగుతుందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌నెట్ వాడకంపై వాళ్లకు ఎంతో అవగాహన కల్పించాల్సి అవసరం ఉంది. డేటా ఉచితంగా లభించడంతో డిజిటల్ పాపులేషన్ బాగా పెరిగిపోయింది. దీంతో సైబర్ నేరగాళ్లకు వీళ్లు టార్గెట్‌లుగా మారుతున్నారు. కాబట్టి నెట్ వినియోగదారులు దీనిపై కాస్త అవగాహన పెంచుకొని ప్రమాదం నుంచి దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *