Breaking News
Home / Lifestyle / Recipes / ముల్తానీ పనీర్‌ టిక్కా

ముల్తానీ పనీర్‌ టిక్కా

కావలసినవి

జున్ను- అరకేజీ, పుట్టగొడుగులు- రెండు కప్పులు, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- రెండు, అల్లం- చిన్నముక్క, కరివేపాకు- ఒక కట్ట, గరంమసాలా- అర టీస్పూన్‌, మిరియాల పొడి- ఒక టీస్పూన్‌, జీలకర్ర – ఒక టీస్పూన్‌, సెనగపిండి- అరకప్పు, ఉప్పు- తగినంత, నూనె- సరిపడా.

తయారీవిధానం

పాన్‌లో నూనె వేసి, కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, పుట్టగొడుగులు వేసి వేగించాలి.
ఉప్పు, గరంమసాలా, మిరియాల పొడి, జీలకర్ర వేసి మరికాసేపు వేగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జున్నులో అల్లం పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పుట్టగొడుగుల మిశ్రమంతో కలిపి పక్కన పెట్టుకోవాలి.
పనీర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పొడవుగా, మధ్యలో కట్‌ చేసి రెండు స్లైస్‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు పుట్టగొడుగుల మిశ్రమాన్ని ఒక పనీర్‌ స్లైస్‌పై రాసి, మరొక స్లైస్‌తో మూసేయాలి. తరువాత సెనగపిండిలో కొన్ని నీళ్లు పోసి మరీ చిక్కగా కాకుండా, పలుచగా కాకుండా కలపాలి. పనీర్‌ స్లైస్‌లను ఈ పిండిలో అద్దుతూ గోధుమరంగు వచ్చే వరకు రెండు వైపులా నూనెలో వేగించాలి. పుదీనా చట్నీతో తింటే ముల్తానీ పనీర్‌ టిక్కా రుచి అదిరిపోతుంది.

 

Check Also

సజ్జలతో మంచూరియా

Share this on WhatsAppకావలసిన పదార్థాలు: సజ్జ పిండి – 150 గ్రా., మిర్చి – 10 గ్రా., కొత్తిమీర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *