Breaking News
Home / States / Telangana / కింగ్ కోఠీ ప్యాలెస్‌ను విక్రయించిన మాయగాళ్ల ఒకరిని ముంబై పోలీసులు అరెస్టు

కింగ్ కోఠీ ప్యాలెస్‌ను విక్రయించిన మాయగాళ్ల ఒకరిని ముంబై పోలీసులు అరెస్టు

”హైదరాబాద్‌లోని వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన నిజాం వారసత్వ సంపదను కశ్మీర్‌కు చెందిన ఓ సంస్థకు సుందరం కొల్రుకుడ్రో రవీంద్రన్, పీ సురేశ్ కుమార్ అమ్మేశారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన రవీంద్రన్ ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. నిజానికి రూ.300 కోట్ల విలువైన ఈ ప్యాలెస్‌ను మూడేళ్ల క్రితమే నజ్రీ బాగ్ ప్యాలెస్ ట్రస్టు నుంచి నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలు చేసింది. అయితే ఈ ముంబై ఆధారిత నిర్మాణ రంగ సంస్థలోనే పనిచేస్తున్న రవీంద్రన్, సురేశ్ కుమార్‌లు.. ప్యాలెస్‌ను నకిలీ డాక్యుమెంట్లతో ఈ ఏడాది జనవరిలో ఐరిస్ హాస్పిటాలిటీ సంస్థకు అమ్ముకున్నారు. జూన్‌లో ప్యాలెస్ పరిశీలనకు వచ్చిన నిహారిక ఇన్‌ఫ్రా అధికారులకు ఇది తెలిసింది. తమ ప్రాపర్టీ మరో సంస్థ పేరున ఉండటాన్ని చూసి తీగ లాగడంతో మాజీ ఉద్యోగుల బాగోతం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, మోసం, నమ్మకద్రోహం, ఫోర్జరీ అభియోగాల కింద కేసు నమోదైంది. ముందు జాగ్రత్తగా లుకౌట్ నోటీసులనూ జారీ చేశారు.

28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్.. హైదరాబాద్ చివరి నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు చెందినది. 1967లో ఈయన అనారోగ్యం కారణంగా చనిపోయారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్‌లోని ప్రధాన భవనంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది” అని ఆ కథనంలో తెలిపారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *