Breaking News
Home / States / Andhra Pradesh / పురపాలక శాఖ తప్పిదం… జనాలకు నవ్వులాట…

పురపాలక శాఖ తప్పిదం… జనాలకు నవ్వులాట…

విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మున్సిపల్ కమిషనర్‌గా మార్చేశారు. పార్వతీపురం పురపాలక శాఖ తప్పిదం జనాలకు నవ్వులాటగా మారింది. వార్డు సచివాలయం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పార్వతీపురం మున్సిపల్ కమిషనర్‌ స్థానంలో ముఖ్యమంత్రి జగన్ ఫొటో పెట్టారు. అంతే కాకుండా ప్రత్యేక అధికారిగా ఎమ్మెల్యే జోగారావు ఫోటోను పెట్టారు. ఈ ఫ్లెక్సీని వార్డు సచివాలయం ముందు ఏర్పాటు చేశారు. దీంతో ఫ్లెక్సీని చూసిన జనాలు నవ్వుకుంటున్నారు. అనంతరం తప్పిదం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు.. వెంటనే ఫ్లెక్సీని తొలగించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *