హైదరాబాద్: పదవీకాలం ముగిసిన నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లు సరిచూసుకోవాలని సూచించింది. 2019 జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ tsec.gov.In లో అందరూ తమ ఓటు హక్కు వివరాలు సరిచూసుకోవాలని కోరింది. ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి జాబితాలో పేర్లు ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
