Breaking News
Home / hyderabad / మునిసిపల్ ఎన్నికల్లో చాలాచోట్ల టీడీపీ పరిస్థితి ఇదీ…

మునిసిపల్ ఎన్నికల్లో చాలాచోట్ల టీడీపీ పరిస్థితి ఇదీ…

హైదరాబాద్‌ : మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉంది. ఆ పార్టీల నుంచే అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఒకప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌ తోపాటు శివారు ప్రాంతాల్లో కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు నామినేషన్లు వేసిన వారి సంఖ్య సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. రెండు, మూడుచోట్ల మాత్రం డబుల్‌ డిజిట్‌లో నామినేషన్‌లు ఉన్నాయి. మొదటిస్థానంలో అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ ఉంటే, కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా? నేనా? అన్నట్లుగా ఉన్నాయి. కాగా కొన్నిచోట్ల బీజేపీ పరిమిత వార్డుల్లోనే తమ అభ్యర్థులను పోటీకి దించింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ 7 కార్పొరేషన్‌లు, 7 మునిసిపాలిటీల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు మాత్రం జల్‌పల్లిలోనే 23 మంది నామినేషన్లు వేయగా, మిగతా చోట్ల 2, 3 నామినేషన్లు మాత్రమే దాఖలు చేశారు. ఇక సీపీఐ, సీపీఎం పార్టీలు అన్ని వార్డుల నుంచి పోటీలో తమ అభ్యర్థులను నిలపకుండా అక్కడక్కడ ఎంపిక చేసిన స్థానాల్లోనే పోటీలో ఉంచింది. కాగా 14న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏ పార్టీ నుంచి ఎంతమంది బరిలో ఉంటారన్న స్పష్టంగా తేలుతుంది. ప్రస్తుతం పార్టీలపరంగా వేసిన నామినేషన్లు బాగా తగ్గిపోయే అవకాశం ఉందని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *