Breaking News
Home / Crime / ఖమ్మంలో దారుణం..లుడోలో ఓడించాడని హత్య.!

ఖమ్మంలో దారుణం..లుడోలో ఓడించాడని హత్య.!

సరదాగా ఆడిన లుడో గేమ్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తనపై లూడో ఆడి గెలిచాడని ఓ వ్యక్తి తన మిత్రుణ్ణి దారుణంగా హత్య చేసాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలోని బోనకల్‌లో సోమవారం రాత్రి 9:30 గంటలకు వట్టికొండ నాగేశ్వరావు, కోలా గోపి అనే మిత్రులు లూడో గేమ్ మొదలు పెట్టారు. మద్యం తాగుతూ మొదట వారు రూ.50 బెట్టింగ్ పెట్టుకున్నారు. అలా రెండు గేమ్ లు ఆడగా రెండింటిలోనూ నాగేశ్వరరావు గెలిచాడు. దీంతో గోపి అసహనానికి గురయ్యాడు. ఈసారి 500 బెట్టిబగ్ పెట్టి ఆడదామంటూ సవాల్ విసిరాడు. కాగా నీకంత సీన్ లేదంటూ నాగేశ్వర్ రావు గోపిని కామెంట్ చేసాడు. దాంతో కోపంతో రగిలిపోయిన గోపి మద్యం సీసాను పగలగొట్టి వెంకటేశ్వర్ రావు మెడపై, పొత్తి కడుపులో పొడిచాడు. దాంతో వెంకటేశ్వర్ రావు అక్కడే కుప్పకూలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

Check Also

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్ట్‌

Share this on WhatsAppవిశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎల్జీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *