Breaking News
Home / World / హఫీజ్ కుమారుడిపై హత్యయత్నం

హఫీజ్ కుమారుడిపై హత్యయత్నం

లాహోర్: డిసెంబర్ 7న పాకిస్థాన్‌లో జరిగిన పేలుడు ప్రస్తుతం అక్కడ సంచలనం రేపుతోంది. కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ పేరు ఈ ఘటనతో ముడిపడి ఉండటమే దీనికి కారణం. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని టైన్‌షిప్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ద్వారా హఫీజ్ సయూద్ కుమారుడు తల్హా సయీద్‌ను మట్టుపెట్టేందుకు ప్రయత్నం జరిగినట్టు ఓ వార్త ప్రస్తుతం పాక్‌లో కలకలం రేపుతోంది. ఉదయం 7 గంటల సమయంలో కంప్రెసర్ పేలిపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. అయితే పోలీసు తనిఖీల్లో మాత్రం ఎటువంటి పేలుడు పదార్థాలూ లభ్యం కాలేదు. ఘటనా స్థలికి కూత వేటు దూరంలో ఓ కార్యక్రమానికి తల్హా హాజరయిన సందర్భంలో ఈ పేలుడు జరగడం ఈ ఊహాగానాలకి తావిచ్చింది. మరోవైపు.. పోలీసులు ఈ విషయమై ఎటువంటి ప్రకటనా చేయకపోవడంతో ఇదే హఫీజ్ కుమారుడిపై హత్యయత్నమేనని పలువురు భావిస్తున్నారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *