హైదరాబాద్: ఎస్ఆర్నగర్లో జరిగిన సైంటిస్ట్ సురేష్ హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. సురేష్‌ను చంపింది అతని అనుచరుడు శ్రీనివాసే అని సీపీ అంజనీకుమార్ అన్నారు. సురేష్-శ్రీనివాస్ మధ్య అనైతిక సంబంధం ఉన్నట్లు సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. అనైతిక సంబంధం, ఆర్థిక వ్యవహారాలే హత్యకు కారణమని సీపీ స్పష్టం చేశారు.
