చెన్నై: తమిళనాడులోని నామక్కల్ జిల్లా మల్లాసముద్రం ప్రాంతానికి చెందిన సిద్ధన్ (55), భార్య ఈశ్వరి దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ తగాదాల కారణంగా దంపతుల మధ్య తరచు గొడవలు జరిగేవి. అంతేకాకుండా, తాగేందుకు నగదు ఇవ్వాలని, భార్య ప్రవర్తనను అనుమానించి ఆమెను వేధించసాగాడు. ఈ నేపథ్యంలో, గురువారం రాత్రి ఈశ్వరి ఫోన్లో మాట్లాడుతుండగా అనుమానించిన అతను ఆమెతో గొడవపడడంతో తారాస్థాయికి చేరుకొని ఆగ్రహించిన సిద్ధన్ కత్తితో భార్య గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆపై సిద్ధన్ కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం ఎంతసేపటికి ఇంటి తలుపులు తెరువక పోవడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అచేతనంగా పడివున్న వారు మృతిచెందినట్లు గుర్తించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
