Breaking News
Home / Film News / నా జీవితం ఎంతో మధురంగా మారింది: శివన్‌

నా జీవితం ఎంతో మధురంగా మారింది: శివన్‌

చెన్నై: నయనతారను కలిసిన తర్వాతే తన జీవితం ఎంతో మధురంగా మారిందని అంటున్నారు కోలీవుడ్‌ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌. ఆయన దర్శకత్వం వహించిన ‘నానుమ్‌ రౌడీదాన్‌’ సినిమాలో నయనతార నటించారు. ఈ సినిమా 2015 అక్టోబర్‌ 21న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి విజయాన్ని అందుకుంది. అయితే సోమవారంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి నాలుగు సంవత్సరాలైన సందర్భంగా విఘ్నేష్‌ సోషల్‌మీడియా వేదికగా నయనతారను ఉద్దేశిస్తూ ఓ భావోద్వేగ పోస్ట్‌ చేశారు. నయన్‌తో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంటూ.. ‘నయన్‌.. నిన్ను కలిసిన తర్వాతే నా జీవితం ఎంతో మధురంగా మారింది. ‘నానుమ్‌ రౌడీదాన్‌’ సినిమాతో నాకు విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాలో నటించి నేనో మంచి జీవితాన్ని పొందే అవకాశాన్ని నాకు అందించావు. నువ్వు ఎప్పుడూ ఇలాగే అందంగా, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. లార్డ్‌ ఆఫ్‌ లవ్‌.’ అని విఘ్నేష్‌ పేర్కొన్నారు.

‘నానుమ్‌ రౌడీదానే’ సినిమాని తెలుగు ‘నేను రౌడీనే’ పేరుతో 2016లో విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే విఘ్నేష్‌-నయన్‌ ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ సరదాగా గడిపేందుకు తరచూ విదేశాలకు వెళ్లివస్తుంటారు. టూర్‌లకు సంబంధించిన ఫొటోలను సైతం విఘ్నేష్‌ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. ప్రస్తుతం నయన్‌ నటిస్తున్న ‘నెట్రికన్‌’ సినిమాకి విఘ్నేష్‌ శివన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *