ముంబై: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు నితేశ్ రాణే బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తాడని మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే తెలిపారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ నా కుమారుడు నితేశ్ రాణే కంకవ్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తాడని తెలిపారు. బీజేపీ విడుదల చేయనున్న రెండో జాబితాలో నితేశ్ పేరుంటుందని పేర్కొన్నారు. నితేశ్ రాణే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కంకవ్లి స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి బీజేపీ అభ్యర్థి ప్రమోద్ జతర్పై గెలుపొందారు.
