నాగబాబు వరస ట్వీట్స్ తో నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. దేశభక్తి గురించి నిన్నటి వరకు ట్వీట్స్ చేసిన నాగబాబు ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. టీటీడీ దేవాలయ భూముల అమ్మకాలను నిలిపేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ నాగబాబు ట్వీట్ చేశాడు.
“టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్వైరీ చేసి నిజాలను నిగ్గు తేల్చండి. థాంక్యూ యు సీఎం గారు ” అని చెప్పి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Ttd భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కి అభినందనలు. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్విరీ చేసి నిజాలను నిగ్గు తేల్చండి.థాంక్యూ యు సీఎం గారు
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 26, 2020