Breaking News
Home / National / భారత్‌ టెన్నిస్‌లో రికార్డు సృష్టించిన నాగల్…

భారత్‌ టెన్నిస్‌లో రికార్డు సృష్టించిన నాగల్…

లండన్‌: భారత్‌ టెన్నిస్‌లో సంచలనం సృష్టించి సుమిత్‌ నాగల్‌ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 26 స్థానాలు జంప్‌చేసి తన కేరీర్‌లోనే బెస్ట్‌ ర్యాంక్‌(135) సాధించాడు. 22 ఏళ్ల నాగల్‌ ఆదివారం జరిగిన బ్యూనాన్‌ ఎయిర్స్‌ ఏటీపీ ఛాలెంజర్స్‌ ఫైనల్లో అర్జెంటీనా ఆటగాడు ఫకండో బోగ్నిస్‌ను ఓడించి వరుస సెట్లలో 6-4, 6-2తో విజయాన్ని సాధించి టైటిల్‌ చేజిక్కించుకున్నాడు. గంటా 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో నాగల్‌ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇటీవల యూఎస్‌ ఓపెన్‌లో తన మొదటి మ్యాచ్‌లో దిగ్గజ ఆటగాడు రోజర్‌ ఫెదరర్‌తో తలపడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్‌లో సుమిత్‌ ఓడిపోయినప్పటికీ, ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. రోజర్‌ ఫెదరర్‌తో ఆడిన ఈ మ్యాచ్‌లో మొదటి సెట్‌ను గెలిచిన భారత ఆటగాడిగా సుమిత్‌ రికార్డు సృష్టించాడు. తర్వాత తేరుకున్న ఫెదరర్‌ వరుస సెట్లలో సమిత్‌ను ఓడించిన విషయం తెలిసిందే.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *