Breaking News
Home / National / మరో నెల రోజులు పెరోల్‌ కోరుతున్న నళిని….

మరో నెల రోజులు పెరోల్‌ కోరుతున్న నళిని….

చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో ఏడుగురు యావజ్జీవశిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో మురుగన్‌ తమిళనాడులోని వేలూరు పురుషుల జైలులోను, అతని భార్య నళిని స్థానిక మహిళా జైలులో ఉన్నారు. కుమార్తె వివాహ ఏర్పాట్ల కోసం మద్రాసు హైకోర్టు ఉత్తర్వులతో గత జూలైలో నెల రోజుల పెరోల్‌పై నళిని విడుదలయ్యారు. అనంతరం పెరోల్‌ను పొడిగించడంతో 51 రోజుల అనంతరం సెప్టెంబరు 15వ తేదీ నళిని మళ్లీ జైలుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తనకు మరో నెల రోజులు పెరోల్‌ కావాలని కోరుతూ నళిని వేలూరు డివిజన్‌ జైళ్ల శాఖ డీఐజీ జయభారతికి వినతిపత్రం సమర్పించారు. శ్రీలంకలో ఉన్న మురుగన్‌ తండ్రి ఆనారోగ్యంతో బాధపడుతున్నారని, అతనికి చికిత్స సమయంలో సహాయంగా ఉండేందుకు తనకు నెలరోజుల పెరోల్‌ కావాలని నళిని వినతిపత్రంలో పేర్కొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *