Breaking News
Home / States / Andhra Pradesh / పులి పిల్లలకు మంత్రి బాలినేని నామకరణం…

పులి పిల్లలకు మంత్రి బాలినేని నామకరణం…

తిరుపతి: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జూపార్క్‌లో సమీర్, రాణి అనే రెండు తెల్ల పులులు ఐదు పులి పిల్లలకు జన్మనిచ్చాయి. ఈ ఐదింటిలో మూడు మగ పిల్లలు కాగా రెండు ఆడ పిల్లలు. విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి జూపార్క్‌ను సందర్శించి పులిపిల్లలను పరిశీలించారు. మగ పులి పిల్లలకు వాసు, సిద్ధాన్‌, జగన్‌ అని, ఆడ పులిపిల్లలకు విజయ, దుర్గ అని మంత్రి నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో జూపార్క్‌ అధికారులు ప్రదీప్ కుమార్, నళినీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *