Breaking News
Home / Politics / డీసీపీ, ఏసీపీ తీరుపై మండిపడ్డ సుహాసిని

డీసీపీ, ఏసీపీ తీరుపై మండిపడ్డ సుహాసిని

హైదరాబాద్: కూకట్‌పల్లి ప్రజాఫ్రంట్ అభ్యర్థి నందమూరి సుహాసిని పోలీసులపై మండిపడుతున్నారు. మాదాపూర్‌ డీసీపీ, కూకట్‌పల్లి ఏసీపీపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆమె ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్ర బహిరంగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు డీసీపీ బంధువు, కృష్ణారావుకు ఏసీపీ బంధువు అని చెప్పారు. తమ కింద పనిచేస్తున్న పోలీసుల ద్వారా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కూకట్‌పల్లిలో పోలింగ్‌ ప్రశాంతంగా జరగాలంటే… ఏసీపీ, డీసీపీలను వెంటనే బదిలీ చేయాలని సుహాసిని డిమాండ్ చేశారు. బాలాజీనగర్‌లో తమ బంధువులను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దూషించి, దాడి చేస్తే పోలీసులు అడ్డుకోలేదన్నారు. అల్లాపూర్‌, ఓల్డ్‌బోయినపల్లిలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలు తరలించాలని నందమూరి సుహాసిని కోరారు.

Check Also

హైదరాబాద్‌లో బాలుడి పైశాచికత్వం

Share this on WhatsAppహైదరాబాద్: మాదాపూర్‌లో ఓ బాలుడి పైశాచికత్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *