Breaking News
Home / Film News / నాని జుట్టు తెల్లబడుతోందట!

నాని జుట్టు తెల్లబడుతోందట!

జట్టు తెల్లబడుతుంటే మనసులో దిగులు మొదలవుతుంటుంది. తెల్ల జట్టు పెరగడాన్ని సామాన్యులే తట్టుకోలేరు. ఇక, గ్లామర్ మీద ఆధారపడే సినిమా హీరోలు తెల్ల జట్టును మరింత సీరియస్‌గా తీసుకుంటారు. అరవైలు దాటినా.. సినిమాల్లోనే కాదు.. బయట కూడా తెల్ల జట్టుతో కనబడడానికి ఇష్టపడరు. రంగేసుకొని నిగినిగలాడే నల్ల జుట్టుతోనే బయటకు వస్తారు.

దీనికి ఒక్క హీరోనే మినహాయింపు. తమిళ స్టార్ హీరో అజిత్.. సినిమాల్లో కూడా తెల్ల జుట్టు, తెల్ల గెడ్డంతో కనిపిస్తుంటాడు. తాజాగా నేచురల్ స్టార్ నానికి కూడా జుట్టు తెల్లబడుతోందట. తన రీసెంట్ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన నాని `తెల్ల జుట్టు వచ్చేసిందిరోయ్` అంటూ కామెంట్ చేశాడు. నాని పోస్ట్‌కు నెటిజన్ల నుంచి స్పందన భారీగా లభిస్తోంది. `ఏం ఫర్వాలేదు బ్రదర్` అని కొందరు ధైర్యం చెబుతుంటే.. తెల్ల జుట్టు రాకుండా ఉండాడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరికొందరు సూచిస్తున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *