Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / జగన్‌పై నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యల

జగన్‌పై నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యల

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తెలుగులో మాట్లాడటంలో, లెక్కల్లో జగన్ చాలా వీక్ అంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు తనను పప్పు అంటున్నారని, జగన్ గన్నేరు పప్పు అనే విషయాన్ని తెలుసుకోవాలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో లేని తనపై అధికారపక్ష నేతలు విమర్శలు చేస్తున్నా స్పీకర్ ఏమాత్రం స్పందించడం లేదని దుయ్యబట్టారు. శాసనసభలో తనను అవమానిస్తున్న మంత్రులు శాసన మండలికి వచ్చాక తన పేరే ఎత్తడం లేదన్నారు. ‘‘అమెరికాలో చదువుకున్నా.. తెలుగులో చిన్న చిన్న తప్పులు మాట్లాడి ఉండొచ్చు. నేను వర్థంతిని జయంతి అంటే ఏపీ అభివృద్ధి ఏమైనా ఆగిపోయిందా?’’ అని వైసీపీ నేతలను లోకేష్ ప్రశ్నించారు. తన తెలుగు భాష కారణంగా ఏపీ నష్టపోయిందా? పోలవరం ఆగిపోయిందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయని లోకేష్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రూ.42వేల కోట్లు దోచుకుని జైలుకెళ్లి వచ్చిన వ్యక్తి నేడు నీతులు చెబుతున్నారని జగన్ తీరును దుయ్యబట్టారు.

జగన్ ముంచే సీఎం అని నిరూపించుకున్నారు..
6 నెలల పాలనలో జగన్ మంచి సీఎం కాదు.. ముంచే సీఎం అని నిరూపించుకున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ పాదయాత్రలో అన్నీ పెంచుతా అంటే ప్రజలు నమ్మారని, ఆ మాటకు కట్టుబడే ఇసుక, మద్యం, ఆర్టీసీ చార్జీలు అన్నీ పెంచుతూ వెళ్తున్నారని దుయ్యబట్టారు. అర్థరాత్రి రహస్యంగా ఆర్టీసీ చార్జీలు పెంచారని విమర్శించారు. నెల్లూరులో మాఫియా రాజ్యం వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యేలే అంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. రాజధానిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేస్తే.. ఆరు నెలలు అయినా ఎందుకు నిరూపించలేకపోయారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అవినీతి, కేసులపై సీఎం జగన్‌తో చర్చకు సిద్ధం అన్నారు. తమకు సంస్కారం ఉంది కాబట్టే ఎక్కువగా మాట్లాడటం లేదన్నారు. వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, ఆయన గురించి ఇక మాట్లాడేదేమీ లేదన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *