Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సైరా’ సినిమాపై నారా లోకేష్‌ ట్వీట్‌

సైరా’ సినిమాపై నారా లోకేష్‌ ట్వీట్‌

అమరావతి: ‘సైరా’ సినిమాపై ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా ‘సైరా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా చిరంజీవిగారి 12 ఏళ్ళ కల అని నారా లోకేష్‌ తెలిపారు. తన కలను ఎంతో అద్భుతంగా చిరంజీవి ఆవిష్కరించుకున్నారని లోకేష్ వెల్లడించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర్య పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచిందని నారా లోకేష్‌ చెప్పారు.

హ్యాట్సాఫ్! చిరంజీవిగారు అంటూ నారా లోకేష్‌ ట్వీట్ చేశారు. చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్‌చరణ్, దర్శకులు సురేంద్ర, చిత్ర యూనిట్‌కి నారా లోకేష్ అభినందనలు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *