Breaking News
Home / National / వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన మోదీ…

వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన మోదీ…

కోల్‌కతా: అంఫన్ తుఫానుతో అతలాకుతలమైన పశ్చిమబెంగాల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. తుఫాను తీవ్రతను తెలుసుకునేందుకు కేంద్ర మంత్రులు, సీఎం మమతాబెనర్జీతో కలిసి ఆయన ఏరియల్ సర్వే జరిపాక ఈ ప్యాకేజీ ప్రకటించారు. అంఫన్ తుఫాను కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్న మోదీ కష్టకాలంలో బెంగాల్ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. తాత్కాలిక సాయం కింద వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిశాక మరింత సాయం చేస్తామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని మోదీ భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం కూడా ప్రధాని ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయల సాయం ప్రకటించారు. కోల్‌కతా నుంచి ప్రధాని భువనేశ్వర్ వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో కలిసి ఏరియల్ సర్వే జరుపుతారు. తుఫాను నష్టాన్ని అంచనా వేసి ఆర్ధిక ప్యాకేజీ ప్రకటిస్తారు.

Check Also

13 న‌గరాల్లోనే లాక్‌డౌన్ 5.0..

Share this on WhatsAppన్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ 4.0 ముగుస్తున్న త‌రుణంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలపై క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *