Breaking News
Home / Film News / 5న విడుదల కానున్న నరేష్ తనయుడి చిత్రం…

5న విడుదల కానున్న నరేష్ తనయుడి చిత్రం…

ఫిల్మ్ న్యూస్: బాలాజీ సనాల దర్శకత్వంలో నవీన్ విజయ క్రిష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, సోఫియా సింగ్ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. రోవస్కైర్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, యుఐ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ట్రైలర్ షేర్ చేస్తూ.. చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. ప్రతి బిట్ చాలా ఎంజాయ్ చేశాను. నవీన్ విజయ కృష్ణకి శుభాకాంక్షలు అని పేర్కొన్నాడు. కె.ఎం.రాధాక్రిష్ణన్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ‘నందిని నర్శింగ్ హోమ్’ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకుని నరేష్ తనయుడు నవీన్ ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది అని మేకర్స్ అంటున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *