Breaking News
Home / World News / నీరవ్ మోదీకి మళ్లీ బెయిల్ నిరాకరణ

నీరవ్ మోదీకి మళ్లీ బెయిల్ నిరాకరణ

లండన్: భారత్‌లో కోట్లాది రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాక్ కుంభకోణంతో పాటు మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనను బెయిల్ ఇచ్చేందుకు రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ బుధవారంనాడు నిరాకరించింది. దీంతో ఆయన ప్రస్తుతానికి జైలుకే పరిమిత కావాల్సి ఉంటుంది. నీరవ్ మోదీకి బెయిల్ నిరాకరించడం ఇది నాలుగోసారి. వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు గతంలో మూడుసార్లు ఆయనకు బెయిల్ నిరాకరించింది.

గత మార్చి 20న అరెస్టయిన నీరవ్.. ప్రస్తుతం లండన్‌లో ఖైదీలతో కిటకిటలాడే హెర్ మెజిస్టీస్ వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నారు. ఆర్థిక నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ప్రకారం నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు ఇంగ్లాండ్ నిర్ణయిస్తే ఆయనను ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

కాగా, తనను అప్పగించాలంటూ భారత్ చేస్తున్న వాదనపై నీరవ్ మోదీ తన వాదన వినిపిస్తూ, తనపై ఎలాంటి నేరారోపణ జరగక ముందు జనవరి 2018లో తాను యూకే వచ్చానని చెబుతున్నారు. చట్టబద్ధంగా తాను బ్రిటన్‌లో ఉంటున్నానని, ఉద్యోగం చేస్తుండటంతో పాటు పన్నులు కూడా చెల్లిస్తున్నానని ఆయన వాదిస్తున్నారు.

Check Also

మరోసారి ‘ట్వీటు’ జారిన ట్రంప్…బ్రిటన్ యువరాజుని…

Share this on WhatsAppవాషింగ్టన్: సంచలనాలకు పర్యాయపదంగా ట్రంప్ మారిపోయారనటంలో ఎంటువంటి సందేహం లేదేమో! కొద్ది రోజుల క్రితం…ఆపిల్ కంపెనీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *