Breaking News
Home / National / కాలుష్య కారణాలను వెల్లడించిన నాసా….

కాలుష్య కారణాలను వెల్లడించిన నాసా….

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకొంది. శుక్రవారం 208, శనివారం 222గా ఉన్న పవన నాణ్యతా సూచి(ఏక్యూఐ) ఆదివారం రాత్రి 10 గంటల సమయానికి 301 మార్క్‌ను తాకింది. రెండో వారం ముగిసే సరికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(సఫర్‌) అంచనా వేసింది. దీనికి గల కారణాలను తాజాగా నాసా వెల్లడించింది. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌) పరిధిలో, చుట్టు పక్కల ప్రాంతాల్లో విపరీతంగా పంట వ్యర్థాలను తగలబెట్టడమే ఇందుకు ప్రధాని కారణమని తేల్చింది. ఈ మేరకు అంతరిక్షం నుంచి తీసిన ఫొటోలను విడుదల చేసింది. ఈ పవన నాణ్యతా సూచి 0-50 మధ్య ఉంటే ప్రమాదకరం కాదు. 51-100 మధ్య ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్లు, 101-200 లోపు ఉంటే మధ్యస్థంగానూ, 201-300 ఉంటే ప్రమాదకరం, 301-400 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకరంగా పరిగణిస్తారు.

గత మూడు నెలల్లో ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని ప్రకటించడం ఇదే తొలిసారి. రుతుపవనాలు, వాయు దిశ అనుకూలించడంతో ఆగస్టు, సెప్టెంబరులో వాయు నాణ్యత కాస్త మెరుగ్గా నమోదైంది. హరియాణా, పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనాన్ని ప్రభుత్వం నిషేధించింది. కానీ, ప్రత్యామ్నాయ మార్గాల కోసం సరైన ఆర్థిక ప్రోత్సాహకాలు అందించకపోవడంతో రైతులు ఆ విధానాన్నే అనుసరిస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *